సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బెల్లంకొండ గణేష్ “స్వాతిముత్యం”.!

Published on Oct 2, 2022 11:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ గణేష్ ని నటుడుగా పరిచయం చేస్తూ ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “స్వాతిముత్యం”. దర్శకుడు లక్ష్మణ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించింది. మరి టీజర్, ట్రైలర్స్ తో మంచి ఆదరణ అందుకున్న ఈ చిత్రం అయితే ఇప్పుడు రిలీజ్ కి దగ్గర పడుతుండగా లేటెస్ట్ గా సెన్సార్ ని అయితే ఈ చిత్రం కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ చిత్రానికి అయితే సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. అయితే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేసిన ఈ సినిమాకి యూ/ఏ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాలి. ఆల్రెడీ సినిమాలో ఓ కాంట్రవర్సియల్ పాయింట్ ని ఫన్ గా చూపించామని తెలిపారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :