సెన్సార్ కంప్లీట్ చేసుకున్న చైతు “థ్యాంక్ యూ”..రన్ టైం ఎంతంటే.!

Published on Jul 20, 2022 9:01 am IST

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పలు చిత్రాల్లో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన చిత్రం “థ్యాంక్ యూ” కూడా ఒకటి. మంచి ప్రమోషన్స్ అక్కినేని ఫ్యాన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంపై ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది.

మరి ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. అలాగే ఈ సినిమాకి టోటల్ రన్ టైం కూడా ఎంత అనేది బయటకి వచ్చింది. ఈ చిత్రానికి పర్ఫెక్ట్ గా 129 నిమిషాల రన్ టైం ని మేకర్స్ కట్ చేసారు. మరి ఇది ఒకింత తక్కువే అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఉండడానికి ఈ తరహా సినిమాల్లో ఇది పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఇక ఈ జూలై 22న వచ్చే సినిమా అయితే ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :