“హిట్ 2” సెన్సార్ పూర్తి..సినిమా వారికి మాత్రమే.!

“హిట్ 2” సెన్సార్ పూర్తి..సినిమా వారికి మాత్రమే.!

Published on Nov 26, 2022 12:00 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2” కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొల్పుకోగా ఇప్పుడు అయితే ఈ చిత్రం అయితే సెన్సార్ ని పూర్తి చేసుకుంది.

అయితే గతంలోనే ఈ చిత్రం చిన్న పిల్లలకి చూడడానికి లేదని స్ట్రిక్ట్ గా పెద్ద వాళ్ళకి మాత్రమే అని చెప్పారు. ఇక ఇప్పుడు అనుకున్నట్టే సెన్సార్ యూనిట్ ఈ చిత్రాన్ని కంప్లీట్ ‘ఏ’ సర్టిఫికెట్ ని అందించారు. దీనితో అయితే ఈ చిత్రం 18 ఏళ్ల లోపు చూడడానికి వీలు లేదని చెప్పాలి. దీనితో అయితే ఈ చిత్రంలో వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రాన్ని అయితే నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చెయ్యగా ఈ డిసెంబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు