క్లీన్ రెస్పాన్స్ తో సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “అంటే సుందరానికి”.!

Published on Jun 4, 2022 12:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “అంటే సుందరానికి” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నజ్రియా ఫస్ట్ టైం తెలుగులో నటించిన సినిమా ఇదే కావడంతో మరింత ఆసక్తిగా వీరి ఫాన్స్ మరియు యూత్ ఎదురు చూస్తున్నారు.

ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ ని కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్నట్టుగానే క్లీన్ యూ సర్టిఫికెట్ ని సెన్సార్ సభ్యులు అందజేశారు.

ఇక థియేటర్స్ లో ఈ సినిమాలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఇస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా వివేక్ సాగర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ చిత్రం జూన్ 10న తెలుగు, తమిళ్, మళయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :