అజిత్, విజయ్ లతో ప్రాజెక్ట్..చైతూ దర్శకుడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on May 1, 2022 8:00 am IST


మన తెలుగు సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులు ఎలాగో అటు తమిళ నాట థలా అజిత్ మరియు తలపతి విజయ్ జోసెఫ్ లు కూడా అంతే అని చెప్పాలి. ఇది వారి అభిమానులకి కూడా తెలుసు. వారి మధ్య ఉండే గట్టి పోటీ బాక్సాఫీస్ లెక్కలు నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి.

అయితే ఈ క్రేజీ కాంబోస్ పై ఒక సరైన మల్టీ స్టారర్ గాని పడితే ఆ హై ఎలా ఉంటుందో కూడా ఊహించలేం. మరి మన దగ్గర ఏమో నాట మాత్రం ఆ ఇద్దరు బిగ్ స్టార్స్ తో కలిపి ఒక సినిమా చెయ్యాలని ఉందని ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు రీసెంట్ గా ఓ కాలేజ్ ఫంక్షన్ లో కామెంట్స్ చెయ్యడం తమిళ సినీ వర్గాల్లో ఆసక్తిగా మారిపోయింది.

దీనితో అభిమానులు కూడా మాసివ్ మల్టీ స్టారర్ సాధ్యమైనంత త్వరగా సెట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే ఈ దర్శకుడు రీసెంట్ గానే మన టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్యతో ఓ ఇంట్రెస్టింగ్ బై లాంగువల్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది. అలాగే ఇది త్వరలోనే పట్టాలెక్కనుంది.

సంబంధిత సమాచారం :