అక్కినేని అభిమానులు చైతు నటిస్తున్న చిత్రాలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాలలో నటిస్తున్నారు దాంట్లో ఒకటి ‘సవ్యసాచి’ . చందు మొండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ చిత్రం ఆగష్టు రెండవ వారంలో విడుదలకానుందని వార్తలు వస్తున్నాయి మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇక చైతు నటిస్తున్న మరొక చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ను కూడా ఈ నెలలో పూర్తి చేసి చిత్రాన్ని ఆగష్టు 31 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇలా చైతు నటించిన రెండు చిత్రాలు ఒకే నెలలో పెద్దగా గ్యాప్ లేకుండా వస్తుండడంతో అభిమానులు కంగారు పడుతున్నారట. అయితే చైతు మాత్రం ఈ రిలీజ్ విషయంలో సైలెంట్ గా వున్నారని సమాచారం. మరి ఈ విషయంలో నాగార్జున ఏం చేయనున్నారో చూడాలి.
