చైతుకు ఆ రెండు చిత్రాలు నచ్చలేదట !

యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్స్ లో బిజీ గా వున్నాడు. దాంట్లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు చైతు సమాధానం ఇచ్చారు. మీరు చేసిన చిత్రాల్లో మీకు నచ్చిన మరియు నచ్చని సినిమాలు ఏంటి అని అడిగిన ప్రశ్నకు చైతు సమాధానం చెప్పుతూ ఇప్పటివరకు నేను చేసిన చిత్రాల్లో గుర్తిండిపోయే చిత్రం ‘ప్రేమమ్’ అలాగే ‘ధడ , బెజవాడ’ చిత్రాలు నాకు నచ్చనివి అని ఇక మీదట ఇలాంటి చిత్రాలు చేయనని ఆయన అన్నారు.

ఇక ఆయన నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం రేపు విడుదలకానుంది. ఇక ఈ చిత్రం తరువాత చైతు ‘నిన్ను కోరి’ పేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈచిత్రంలో చైతు సరసన సమంత నటించనుంది. నిజ జీవితంలో భార్య భర్తలైన వీరిద్దరూ ఈ చిత్రంలో కూడా ఆ పాత్రల్లోనే కనిపించనున్నారు.

Advertising
Advertising