“లాల్ సింగ్ చద్దా”లో చైతు పాత్ర అదే !

Published on Oct 24, 2021 6:08 pm IST

స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న సినిమా “లాల్ సింగ్ చద్దా”. కాగా నాగ చైతన్య కెరీర్ లో మొదటిసారి ఈ “లాల్ సింగ్ చద్దా” సినిమాతో బాలివుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే ఈ భారీ బాలీవుడ్ సినిమాలో నాగ చైతన్య పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని.. సినిమాలో చైతు అమీర్ అనుచరుడిగా నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే ప్రీ క్లైమాక్స్ లో చైతు పాత్ర చనిపోతుందని, దేశం కోసం ప్రాణ త్యాగం చేసే గొప్ప పాత్రలో చైతు నటిస్తున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని మొదట ఈ క్రిస్మస్ కి భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అమీర్ ఈ ఏడాది తన సినిమా రిలీజ్ కి సముఖంగా లేకపోవడంతో రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది. ఇక అమీర్ ఖాన్ కి, నాగ చైతన్యకి మధ్య ఈ సినిమా షూటింగ్ సమయంలో మంచి స్నేహం ఏర్పడింది. అందుకే చైతన్య ‘లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి కూడా అమీర్ ఖాన్ ప్రత్యేక అతిధిగా వచ్చాడు.

సంబంధిత సమాచారం :

More