రామ్ ముందు అతిపెద్ద సవాల్ ఇదే..!

Ram-Pothineni

వరస పరాజయాల తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన నెక్స్ట్ చిత్రం కోసం ఆయనే స్వయంగా కథను సిద్ధం చేసుకొని, దానికి దర్శకత్వం వహించడంతో పాటు సొంతంగా నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు. ఇలా ఒకేసారి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించడం రామ్ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్ అని చెప్పాలి. నిర్మాణ బాధ్యతలను ఆయన సోదరుడు కృష్ణ చైతన్య పర్యవేక్షిస్తున్నప్పటికీ.. కాస్టింగ్, బడ్జెట్, షెడ్యూల్స్ వంటి కీలక నిర్ణయాలన్నీ రామే స్వయంగా చూసుకుంటున్నాడు.

కెరీర్‌లో కీలకమైన ఈ దశలో రామ్‌పై చాలా పెద్ద బాధ్యత పడిందనే చెప్పాలి. నటుడిగా 100 శాతం ఎఫర్ట్స్ పెడుతూనే, డైరెక్షన్ సీట్‌లో కూర్చోవడం అంత సులువు కాదు. ఈ స్క్రిప్ట్ కోసం రామ్ చాలా సమయం కేటాయించగా, ఇటీవలే షూటింగ్ ఫార్మాలిటీస్ కూడా ప్రారంభమయ్యాయి. పైగా, ఈ సినిమా కోసం రామ్ భారీ మొత్తంలోనే డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నాడు.

ప్రస్తుతం నాన్-థియేట్రికల్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేని సమయంలో.. సొంతంగా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీయడం ట్రేడ్ వర్గాల ప్రకారం ఒక పెద్ద రిస్క్ అనే చెప్పాలి. సినిమా హిట్ అయితే భారీ లాభాలు వస్తాయి. కానీ ఈ క్లిష్ట సమయంలో నటన, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని రామ్ చేస్తున్న ఈ ప్రయత్నం, ఆయనకున్న గట్స్ నిజంగా అభినందనీయం.

Exit mobile version