ఆ షో జడ్జ్‌మెంట్ విషయంలో నిత్యామీనన్, తమన్‌కి మధ్య చిన్న క్లాష్..!

Published on Apr 29, 2022 3:00 am IST


ఇండియన్ ఐడల్.. ఈ షోకు ఉన్న ప్రేక్షకాదరణ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యవ గాయనీ గాయకులను వెలుగులోకి తెస్తున్న ఈ షో హిందీలో 12 సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే ఇలాంటి సింగింగ్ కాంపిటేషన్ షోను తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో జరుగుతున్న ఈ మ్యూజిక్ కాంపిటేషన్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. గతంలో ఇండియన్ ఐడల్‌గా నిలిచిన ప్రముఖ సింగర్ శ్రీరామ చంద్ర ఈ షోకు హోస్ట్‌గా పనిచేస్తుండగా, తమన్, నిత్యామీనన్, కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ షో డబుల్ ధమాకా స్పెషల్‌ను జరుపుకుంటుంది. తాజాగా విడుదలైన ఓ ప్రోమోను చూస్తుంటే నిత్యా మీనన్ మరియు తమన్ మధ్య మాటల గొడవ జరిగినట్టు తెలుస్తుంది. శ్రావణ భార్గవితో జతకట్టిన మారుతి నుండి ఏవండోయ్ నానిగారు అనే పాటను పెట్టాడు. అయితే ఈ పాట నిత్యామీనన్, కార్తీక్‌లకు తెగ నచ్చేసింది. కానీ తమన్ మాత్రం మారుతీ వాయిస్ బాగోలేదంటూ కామెంట్స్ చేశాడు. ఈ కారణంగానే నిత్యా మీనన్, తమన్ మధ్య చిన్నపాటి మాట్ల యుద్ధం నడిచింది.

సంబంధిత సమాచారం :