నాగ శౌర్య ‘చలో’ రిలీజ్ డేట్ ఫిక్స్ !
Published on Nov 14, 2017 1:26 pm IST

‘జ్యోఅచ్యుతానంద, కళ్యాణ వైభోగమే’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న యువ హీరో నాగ శౌర్య వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. తమిళ డైరెక్టర్ విజయ్ తో ‘కణం’ సినిమాలో నటిస్తున్న ఈ హీరో త్రివిక్రమ్ అసిస్టెంట్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ‘చలో’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 29 న విడుదల చెయ్యబోతున్నారు.

నాగ్ శౌర్య సొంత బ్యానర్ ‘ఐరా క్రియేషన్స్’ పై ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ సినిమా హీరోయిన్ రష్మిక మందన్న ఈ చిత్రంలో నాగ శౌర్య కు జంటగా నటిస్తోంది. మణిశర్మ తనయుడు సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. త్వరలో ఈ సినిమా ఆడియోను విడుదల చెయ్యనున్నారు చిత్ర యూనిట్.

 
Like us on Facebook