ట్రైలర్ లాంచ్ లో చాణక్య !

Chanakya3

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై తమిళంలో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన భారీ చిత్రం ‘చాణక్య’. ఎంటర్టైనింగ్ గా సాగే స్పైయాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం పై అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొనివున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా దర్శకుడు తిరు ‘చాణక్య’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ దసపల్లా హోటల్ లో ఏర్పాటు చేసిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హీరో గోపీచంద్, హీరోయిన్స్ మెహ్రీన్, జరీన్ ఖాన్ దర్శకుడు తిరు, నిర్మాత అనిల్ సుంకర, రామజోగయ్య శాస్రి, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం అనుకోకుండా దర్శకుడు తిరుకి కాల్ చేసి మంచి కథ ఉంటే చెప్పు అన్నాను అప్పుడు చాణక్య కథ చెప్పాడు. స్పై బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ‘చాణక్య’ మా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ లో ఒక మెమొరబుల్ మూవీ అవుతుంది. డైరెక్టర్ తిరు చాలా టాలెంట్ వున్న వ్యక్తి ఫస్ట్ డే స్టోరీ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు సినిమా ఔట్ ఫుట్ చూసి అలాగే ఫీల్ అవుతున్నాను. అందరూ ఇది స్పై థ్రిల్లర్ అంటున్నారు కానీ ఈ చిత్రంలో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. స్పై థ్రిల్లర్ జోనర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. అలాగే హీరో గోపీచంద్ కి కూడా ఈ కథ బాగా నచ్చింది. ఇది ఆయన కెరీర్ లో ఒక గేమ్ చేంజర్ మూవీ అవుతుంది. మెహ్రిన్ తో సెకండ్ టైం వర్క్ చేస్తున్నాను. ఆమె సెట్లో చాలా ఫన్నీ గా ఉంటుంది. జరీన్ ఖాన్ యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగా చేసింది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్ రాశారు. శాస్రి గారు మా ఫ్యామిలీ మెంబర్. అన్ని మంచి పాటలు రాశారు. దర్శకుడు తిరు గురించి ఒక్కటే చెప్పదలుచుకున్నాను తెలుగు ఇండస్ట్రీ కి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో మేము ఖర్చుపెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద రెండింతలు కనపడేలా చేశారు. అక్టోబర్ 5 విడుదలయ్యే చాణక్య స్పై థ్రిల్లర్ మూవీస్ వన్ ఆఫ్ బెస్ట్ మూవీ అవుతుంది” అన్నారు.

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. తిరు ఏదయితే చెప్పారో పర్ఫెక్ట్ గా తెరకెక్కించారు. వెట్రి ఫోటోగ్రఫీ బ్యూటిఫుల్ గా చేసాడు. ఆయనతో నాలుగు సినిమాలు చేశాను. అబ్బూరి రవి డైలాగ్స్ ట్రేండింగ్ లో ఉంటాయి, నాతో హిందీలో కూడా డైలాగ్స్ చెప్పించారు. అలాగే మెహ్రీన్ తో నా సెకండ్ మూవీ మా ఇద్దరి లవ్ ట్రాక్ సీన్స్ యూత్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. జరీన్ ఖాన్ నార్త్ ఇండియన్ అమ్మాయి పాత్రలో యాప్ట్ గా కుదిరింది. విశాల్ చంద్రశేఖర్ మూడు అద్భుతమైన పాటలు ఇచ్చారు. శ్రీ చరణ్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు ఒక పాట ఇచ్చారు. శాస్రి గారు సిట్యువేషన్స్ కి తగ్గట్లు పాటలు రాశారు. రాజస్థాన్ ఎండలో,చలిలో మా టీం చాలా కష్టపడి చేశారు. అక్టోబర్ 5 న ప్రతి ఒక్కరూఎంజాయ్ చేస్తారు” అన్నారు. దర్శకుడు తిరు మాట్లాడుతూ.. ఇది నా మనసుకి బాగా నచ్చిన స్క్రిప్ట్. అనిల్ సుంకర గారు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అమేజింగ్ గా నిర్మించారు. అబ్బూరి రవి సూపర్బ్ డైలాగ్స్ రాశారు. అందరం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశాం. తప్పకుండా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంతో వున్నాం.. అన్నారు.
మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. అనిల్ సుంకర గారు ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ చేశారు. అనుకున్న బడ్జెట్ కన్నా కథ కి ఏంకావాలో దానికి మించి ఖర్చుపెట్టారు. అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది” అన్నారు.

Exit mobile version