‘కార్తికేయ 2’తో ఫామ్ లోకి వస్తాడట !

నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ- 2’సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పుర్తయింది. స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.

ఇక ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్ర దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Exit mobile version