బిగ్ బిని కలిసిన “కార్తికేయ2” డైరెక్టర్!

Published on Aug 19, 2022 1:34 pm IST


నిఖిల్ సిద్ధార్థ్ మరియు అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 టికెట్ విండోస్ వద్ద తన సత్తా ను కొనసాగిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ ఆధ్యాత్మిక థ్రిల్లర్ ఉత్తర భారతదేశంలో కూడా సంచలన విజయం సాధించింది. ఈ రోజు, చందూ మొండేటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ ద్వారా ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది.

ఈ ఫోటోలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌కి చందూ మొండేటి నమస్కారం చేస్తున్నారు. దర్శకుడు పిక్‌కి ఆ ఆశీర్వాదాలు, ధన్యవాదాలు అమితాబ్ బచ్చన్ జీ, లైఫ్ టైమ్ మెమరీస్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెజెండ్ కార్తికేయ 2 చూసి దర్శకుడిని కలవమని పిలిచినట్లు కనిపిస్తోంది. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, హర్ష చెముడు మరియు శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :