తానా 22 వ మహాసభలకు ముఖ్య అతిధి గా చంద్రబాబు !

Published on Apr 15, 2019 3:00 pm IST

ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తానా అధ్యక్షుడు వేమన సతీష్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రతినిధి కోమటి జయరాం, తానా ఇండియా కోఆర్డినేటర్ గారపాటి ప్రసాద్ కలిసి జులై 4 నుండి 6 వరకు వాషింగ్టన్ డీసీ లో జరగబోయే తానా 22వ మహాసభలకు ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా 2007 లో జరిగిన తానా మహాసభలకు హాజరైన విషయాన్ని గుర్తు చేసుకుంటూ తానా మహాసభలకు తప్పక హాజరు అవుతానని, తానా సభ్యులకు, అమెరికాలోని తెలుగువారికి ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసారు.

యాభయికి పైగా దేశాలనుంచి ప్రవాస తెలుగు సంస్థల ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభలకు ప్రముఖ నటీనటులు, కవులు, కళాకారులు హాజరుకానున్నారు. నాలుగు వందలకు పైగా వాలంటీర్లు ఈ మహాసభల విజయవంతానికి శ్రమిస్తున్నారు. ఈ మహాసభలలో ఏర్పాటు చేయబోయే స్టాల్ల్స్ కి బాగా డిమాండ్ నెలకొంది. ఈ మహాసభల వివరాలు www.tana2019.org ద్వారా తెలుసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :

X
More