చిరంజీవికి చంద్రబాబు ఫోన్.. సాయి తేజ్ ఆరోగ్యంపై ఆరా..!

Published on Sep 13, 2021 9:40 pm IST


మెగాహీరో సాయిధరమ్ తేజ్ మూడు రోజుల కిందట హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు స్పందిస్తూ సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. పలువురు నేరుగా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చిరంజీవికి ఫోన్ చేసి హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాయితేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా చంద్రబాబు తెలియజేశారు.

సంబంధిత సమాచారం :