చంద్రబోస్ చేతుల మీదుగా ‘కలయా నిజమా..” !

చంద్రబోస్ చేతుల మీదుగా ‘కలయా నిజమా..” !

Published on Sep 26, 2021 2:38 PM IST

నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో* ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.

అనంతరం ముఖ్య అతిథి చంద్రబోస్ మాట్లాడుతూ, “కలయా నిజమా… అనే పల్లవితో సాగే ఈ పాటలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు. చిత్రంలో సందర్భాను సారంగా వచ్చే విషాదభరిత ఈ పాట గుండెలను పిండేశాలా ఆకట్టుకుంటోంది. హీరో నాగవర్మ తన హావభావాలతో పాటను రక్తికట్టించారు. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్ కొరియోగ్రఫీ పాటకు ప్రాణంపోశాయి. సినిమా విజయవంతం కావాలని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని అన్నారు.

చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ మాట్లాడుతూ, “చిత్రంలో అద్భుతమైన సాహిత్యం కలిగిన ఈ పాటను చంద్రబోస్ గారు ఆవిష్కరించడం ఎనలేని ఆనందంగా ఉంది. ఇందులో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. ఏ పాటకు ఆ పాట పోటాపోటీగా అలరింపజేస్తాయి. సమష్టి కృషితో చిత్రం చాలా బాగా వచ్చింది. అక్టోబర్లో అనుకూలమైన మంచి డేట్ చూసుకుని చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు.

సంగీత దర్శకుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ, ఇందులోని ఐదు పాటలు సందర్భానుసారంగా సాగుతూ కథను ముందుకు నడిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగా వచ్చిందని చెప్పగా… కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ, ఇందులోని అన్ని పాటలకు తాను కొరియోగ్రఫీ చేశానని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు