లేటెస్ట్ : ‘దసరా’ సెకండ్ సాంగ్ రిలీజ్ లో మార్పులు

Published on Feb 13, 2023 4:30 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా అందాల నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ రస్టిక్ డ్రామా మూవీ దసరా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ధూమ్ ధామ్ దోస్తాన్ అందరినీ ఎంతో ఆకట్టుకుని భారీ స్థాయి వ్యూస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

అలానే ఆ తరువాత రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కూడా సూపర్ రెస్సాన్స్ ని సొంతం చేసుకుని మూవీ పై మరింతగా అంచనాలు ఏర్పరిచింది. అయితే విషయం ఏమిటంటే, నేడు సాయంత్రం 5 గం. 4 ని. లకు ఈ మూవీ నుండి ఓరి వారి అనే పల్లవితో సాగే బ్రేకప్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ సాంగ్ యొక్క తెలుగు తెలుగు వర్షన్ ని మాత్రమే నేడు రిలీజ్ చేయనున్నాము, మిగతా నాలుగు భాషల వర్షన్స్ ని రేపు రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం దసరా మేకర్స్ అనౌన్స్ చేసారు. కాగా ఈ మూవీ మార్చి 30న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :