
మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుందన్నది తెలిసిన విషయమే. ముందుగా ఈ సినిమా అక్టోబర్ 5న మొదలుకానుంది అని తెలిపినా ఇప్పుడు ఆ డేట్ వాయిదాపడి అక్టోబర్ 9కి చేరింది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్
మహేష్ ఈ సినిమాలో ఒక విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. మిర్చి సక్సెస్ తో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. మరి గతకొంతకాలంగా మహేష్ ని ఊరిస్తున్న హిట్ ఈ సినిమాతో రావాలని కోరుకుందాం