గల్లీ రౌడీ “చాంగురే ఐటెం సాంగురే” ఫుల్ వీడియో సాంగ్ రేపే..!

గల్లీ రౌడీ “చాంగురే ఐటెం సాంగురే” ఫుల్ వీడియో సాంగ్ రేపే..!

Published on Sep 22, 2021 9:53 PM IST


యంగ్ హీరో సందీప్‌ కిషన్, నేహా శెట్టి హీరోయిన్‌గా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘గల్లీ రౌడీ’ సినిమా సెప్టెంబర్ 17న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ని దక్కించుకుంది. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్‌ సమర్పణలో, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ సినిమాని నిర్మించారు. అయితే రేపు సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా నుంచి “చాంగురే ఐటెం సాంగురే” ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ కాబోతుంది.

అయితే ఈ పాటకి భాస్కరభట్ల లిరిక్స్ రాయగా, మంగ్లీ ఆలపించింది. ఈ పాటకి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాలో బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణమురళి, వైవా హర్ష, రాజేంద్ర ప్రసాద్, స్నేహ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు