ఆహా మినీస్ “యూ ఆవకాయ మీ ఐస్ క్రీం” పాత్రల ఇంట్రడక్షన్!

Published on Aug 4, 2021 11:36 am IST


ఆవకాయ లాంటి అమ్మాయి, ఐస్ క్రీం లాంటి అబ్బాయి ఇంకా వీరి ప్రపంచాన్ని మరింత స్పైసీ గా మార్చే ఎందరో పాత్రలకి సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో ను విడుదల చేసింది ఆహా వీడియో. ఆహా మినీస్ అంటూ ఆహా వీడియో సరికొత్త ప్రయోగం మొదలు పెట్టింది. అందులో ముందుగా యూ ఆవకాయ మీ ఐస్ క్రీం అంటూ ఒక మినీ మూవీ ను ఆగస్ట్ 6 వ తేదీన విడుదల చేయనుంది. అయితే అందుకు సంబంధించిన పాత్రల ఇంట్రడక్షన్ ను విడుదల చేయడం జరిగింది.

అయితే ఈ వీడియో ఆద్యంతం ఆసక్తి కరంగా ఉండటం తో ఈ ఆహా మినీ పై ఆసక్తి నెలకొంది. ఈ మిని మూవీ లో షీతల్ గౌతమన్, ఉద్భవ్ రఘునందన్, నాగబాబు కొణిదెల, రమేష్, సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ లు నటిస్తున్నారు. ఈ మినీ చిత్రానికి భార్గవ్ దాసరి దర్శకత్వం వహిస్తుండగా నవీన్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :