చరణ్-శంకర్ ప్రాజెక్ట్.. ఆ ఒక్క పాట కోసం 12 రోజులు..!

Published on Oct 25, 2021 9:38 pm IST


మెగా హీరో రామ్ చరణ్-శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళగా, ప్రస్తుతం ఈ సినిమా షూటింగు పూణేలో జరుగుతుంది. చరణ్-కియారా అద్వాని మధ్య అక్కడ ఒక పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

అయితే ఈ పాట కోసం శంకర్ ఏకంగా 12 రోజులను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా శంకర్ సినిమాల్లో పాటలు భారీ బడ్జెట్‌తో భారీతనంగా ఉంటాయి. ఇప్పుడు చరణ్-కియారాపై చిత్రీకరిస్తున్న ఈ పాట కూడా అద్భుతమైన విజువల్స్‌తో ఉండబోతుందని, అందుకే ఈ పాటకు ఎక్కువ సమయం తీసుకున్నారని, పాటకు ఉన్న ప్రాధాన్యత కారణంగానే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టేందుకు కూడా దిల్‌రాజు వెనుకాడడంలేదని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :