వారందరికీ చరణ్, ఉపాసన స్పెషల్ థాంక్స్.!

వారందరికీ చరణ్, ఉపాసన స్పెషల్ థాంక్స్.!

Published on Dec 27, 2022 2:02 PM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ చేస్తుండగా చరణ్ నటించిన రెండు చిత్రాలు ఆల్రెడీ ఈ ఏడాది రిలీజ్ అయ్యాయి. మరి ఫ్యాన్స్ కి కావాల్సిన ట్రీట్ ని అంతా తాను ఈ ఏడాది అందించేసాడు.

ఇక వీటితో పాటుగా చరణ్ అయితే తాను మరియు తన భార్య ఉపాసన లు తల్లిదండ్రులు కాబోతున్నామన్న ఎంతో మంచి శుభవార్తను కూడా షేర్ చేయడం ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సినీ పరిశ్రమ నుంచి కూడా ఎంతోమంది చరణ్ అండ్ ఉపాసన కి కంగ్రాట్స్ తెలియజేయగా లేటెస్ట్ గా ఈ ఇద్దరు దంపతులు వారందరికీ స్పెషల్ థాంక్స్ పోస్ట్ అయితే పెట్టారు.

మరి ఇద్దరూ కూడా స్టన్నింగ్ డ్రెస్సింగ్ తో రెడీ అయ్యిన ఫోటో షూట్ తో తమ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందం వ్యక్తం చేశారు. దీనితో వీరి పోస్ట్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు