రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ డీటెయిల్స్ !

రామ్‌చరణ్‌, బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఇటివల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న కీరా అద్వాని ఈ సినిమాలో చరణ్ సరసన నటించబోతోంది.

బాలివుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో చరణ్ ను మాస్ యంగల్ లో ప్రెజెంట్ చెయ్యబోతున్నాడు దర్శకుడు బోయపాటి. ఈ మూవీ కి సంభందించిన మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.