చిరంజీవి పై క్రేజీ కామెంట్స్ చేసిన చరణ్ !

Published on Apr 25, 2022 9:01 am IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ కి దగ్గర పడింది. దాంతో చిత్రబృందం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో రామ్ చరణ్ కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఆచార్య సినిమాకు సంబంధించి బోలెడు విషయాలు చెబుతున్నారు. అయితే, తాజాగా చరణ్.. చిరు గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఆ కామెంట్స్ ఏమిటో చరణ్ మాటల్లోనే.. ‘నా చిన్న తనంలో నాన్నగారు పొద్దున్న షూటింగ్‌కి వెళ్తే రాత్రికి ఇంటికి వచ్చే వారు. ఆ కారణంగా నా వ్యక్తిగత జీవితంలో నాన్నగారు నేనూ ఎక్కువగా కలిసుండే అవకాశం మాకు కలగలేదు. ఐతే, ‘ఆచార్య’ సినిమా మాకు మరిచిపోలేని జ్ఞాపకాల్ని అందించింది. 20 రోజుల పాటు నాన్న గారితో నేను మారేడుమిల్లి లో కలిసి ఉన్నాను. సెట్స్‌లో అడుగుపెట్టాక, నాన్న నన్ను తన కొడుకుగా కాకుండా ఓ నటుడిగా చూసేవారు’ అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.

రామ్‌ చరణ్, నిరంజన్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటించగా, రామ్‌ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటించారు. ‘ఆచార్య’ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :