చరణ్ 15..శంకర్ విషయంలో మాత్రం ఫుల్ హ్యాపీలో ఉన్న ఫ్యాన్స్.!

Published on Apr 14, 2022 9:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” తో తన కెరీర్ లో మరో భారీ హిట్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి దీనితో ఈ సినిమా అనంతరం చరణ్ మరో ఇండియన్ టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తుండడంతో ఆ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లో 15వ సినిమాగా చాలా గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో అయితే చరణ్ అభిమానులు హ్యాపీ గానే ఉన్నారని చెప్పాలి. శంకర్ తన మార్క్ లో హీరోని ఎక్కడా తగ్గకుండా ప్రెజెంట్ చేస్తున్నట్టు అందరికీ ఇప్పుడు ఆదం అవుతుంది.

ముఖ్యంగా చరణ్ నుంచి కీలక షేడ్స్ చూపించడం వారికి ఆనందం కలిగిస్తుంది. దీనితో శంకర్ విషయంలో అయితే ఇప్పటికి ఫుల్ హ్యాపీ లోనే వారు ఉన్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :