ఈ డైరెక్టర్ తో సినిమాపై ఎగ్జైటెడ్ గా ఉన్న చరణ్ ఫ్యాన్స్.!

Published on May 21, 2022 10:01 am IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా “రౌద్రం రణం రుధిరం” ఓటిటి లో వచ్చి మళ్లీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా తర్వాత చరణ్ మరో ఇండియన్ టాప్ దర్శకుడు అయినటువంటి శంకర్ తో ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తమ కెరీర్ లలో బెంచ్ మార్క్ సినిమా 15వ సినిమాగా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఒక సెన్సేషన్ అనుకుంటే దీని తర్వాత కూడా సాలిడ్ లైనప్ ని చరణ్ సెట్ చేసుకొని తన సినిమాలపై హైప్ ని ఒక రేంజ్ లో నిలుపుకున్నాడు. అయితే ఇదిలా ఉండగా చరణ్ అభిమానులు అయితే లేటెస్ట్ గా ఓ దర్శకుడు తో సినిమాపై మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

ఆ దర్శకుడు మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్. రీసెంట్ గా ఖైదీ మరియు మాస్టర్ చిత్రాలతో సాలిడ్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు ఉలగనయగన్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే భారీ సినిమా చేసాడు. అయితే ఈ క్రేజీ కాంబోలో ఎప్పుడు నుంచో సినిమా కోసం టాక్ ఉంది. కానీ లేటెస్ట్ గా అయితే ఆ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అన్నట్లుగా హింట్స్ వస్తుండడంతో ఇప్పుడు మరింత ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :