వైరల్ : తారక్ సాంగ్ లో రాజమౌళిని మెప్పించిన చరణ్.!

Published on Feb 1, 2023 4:42 pm IST

ప్రస్తుతం ప్రపంచ సినిమా అంతా ఆసక్తిగా మాట్లాడుకుంటున్న ఏకైక ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది మన టాలీవుడ్ చిత్రం రౌద్రం రణం రుధిరం “RRR” కోసమే అని తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు అలాగే సినిమా దర్శకుడు రాజమౌళి కూడా ఈ సినిమాలో గ్లోబల్ గా భారీ ఫేమ్ ని అయితే తెచ్చుకున్నారు. ఇక ఇక్కడ నుంచి వరల్డ్ సినిమా దగ్గర క్రేజీ గా మారిన వీరు పలు అంతర్జాతీయ మీడియా కి కూడా ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.

అలా లేటెస్ట్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఓ ఇంట్రెస్టింగ్ అంశం వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ భీమ్ పాత్రపై నడిచే ఎమోషనల్ సాంగ్ “కొమురం భీముడో” ఎంతలా హత్తుకుందో అందరికీ తెలిసిందే. మరి ఈ సాంగ్ లో తారక్ ఎలాంటి నటనను కనబరిచాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో తనతో పాటుగా చరణ్ కూడా తనకున్న స్పేస్ లో అద్భుతంగా నటించి మెప్పించాడు.

మరి దీనిపైనే చరణ్ మాట్లాడుతూ ఈ సాంగ్ లో తాను ఇలా చేస్తానని రాజమౌళిని అడిగి మరీ చేసానని తెలిపాడు. రాజమౌళి రామరాజు పాత్రలో ఎలాంటి భావోద్వేగాలు కనబడకుండా కేవలం భీమ్ పాత్రని శిక్షించమని మాత్రమే చెప్పాడని కానీ తాను ఎమోషన్ తో పాటుగా చేస్తానని రాజమౌళిని రిక్వెస్ట్ చేసి చేసానని చెప్పారు. మరి తాను చేసింది చూసాక రాజమౌళి కూడా అమితంగా ఇంప్రెస్ అయ్యాడని ఆ సాంగ్ తన బ్యూటిఫుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నాడు. దీనితో ఈ క్లిప్ ఫ్యాన్స్ మధ్య వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :