ఆసక్తిగా మారుతున్న చరణ్ లైనప్.!

ఆసక్తిగా మారుతున్న చరణ్ లైనప్.!

Published on Nov 6, 2022 11:00 AM IST

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం కోసం తెలిసిందే. దర్శకుడు శంకర్ తో అయితే చరణ్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు. ఇక దీనిపై అనేక అంచనాలు ఉండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేసే సినిమా ఏది ఎవరితో అనే అంశాలు మంచి వైరల్ గా మారాయి. ఇక లేటెస్ట్ గా అయితే దర్శకుడు సుకుమార్ తో సినిమా అంటూ కొన్ని రూమర్స్ రాగా ఇప్పుడు మరింత ఆసక్తికర బజ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యింది.

కొన్ని రోజులు కితమే చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబోలో సినిమా ఉండొచ్చని టాక్ వచ్చింది. మరి ఇది ఆల్ మోస్ట్ అయ్యేలానే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనితో నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు తోనే స్టార్ట్ చేసే ఛాన్స్ లు కూడా ఉన్నాయట. దీనితో అయితే ఇప్పుడు చరణ్ లైనప్ మంచి ఆసక్తిగా మారింది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం అయితే వెకేషన్ ని పూర్తి చేసుకొని వచ్చిన చరణ్ నెక్స్ట్ శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు