చరణ్ నెక్స్ట్ గా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్.?

చరణ్ నెక్స్ట్ గా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్.?

Published on Nov 3, 2022 8:00 AM IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం కోసం అందరికీ తెలిసిందే. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత మళ్ళీ పాన్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ తో వర్క్ చేస్తున్న హీరోగా ఇండియన్ సినిమా దగ్గర చరణ్ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఇక ఈ సినిమాపై అయితే అనేక అంచనాలు కూడా సెట్టవ్వగా నెక్స్ట్ అయితే చరణ్ ఏ దర్శకునితో సినిమా చేస్తాడు అనే అంశం చాలా ఆసక్తిగా మారింది.

అయితే దానిని గౌతమ్ తిన్ననూరి చేయాల్సి ఉండగా ఆ చిత్రం ఆగిపోయింది. కానీ ఇప్పుడు అయితే ఈ 16వ సినిమాకి గాను సెన్సషనల్ కాంబో రిపీట్ అవ్వబోతునట్టుగా సినీ వర్గాల్లో ఓ టాక్ అయితే ఊపందుకుంది. రామ్ చరణ్ కెరీర్ లో ఓ క్లాసిక్ లాంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు సుకుమార్ తోనే చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిని కూడా సుకుమార్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చెయ్యగా ప్రస్తుతానికి అయితే ఇది టాక్ గానే నడుస్తుంది, ఇక ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు