బాబాయ్ టీజర్ అబ్బాయికి నచ్చేసింది !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ చిత్రం యొక్క టీజర్ శనివారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోనే పలు రికార్డులు సృష్టించిన ఈ టీజర్ ఇప్పటి వరకు 7.8 మిలియన్లను వ్యూస్ ను 4. 47 లక్షల లైక్స్ ను సొంతం చేసుకుంది. దీన్నిబట్టే టీజర్ అభిమానులు, ప్రేక్షకులకు ఎంతలా కనెక్ట్ అయ్యిందో తెలిసిపోతోంది.

ఇక హీరో రామ్ చరణ్ కూడా టీజర్ ను చూసి ‘బాబాయ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. ఆయన హావభావాలు చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి చాలా నచ్చేసింది. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుసూస్తున్నాను’ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. చరణ్ తో పాటు హీరో హీరోయిన్లు చాలా మంది టీజర్ ను ప్రశంసించారు. భారీ అంచనాలతో జనవరి 10న విడుదలకానున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా కొత్త రికార్డుల్ని క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.