క్రేజీ : క్రాస్ రోడ్స్ లో ఆల్ టైం రికార్డ్ సెట్ చేసిన చరణ్.!

Published on Mar 26, 2023 10:57 am IST


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా అయితే ఆల్రెడీ చరణ్ ఫాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ అయితే మాస్ యుఫొరియా ఆల్రెడీ స్టార్ట్ చేయగా ఈ మార్చ్ వారికి మరింత స్పెషల్ మార్చ్ గా నిలిచిపోయింది. మరి ఈసారి బర్త్ డే మంత్ లో చరణ్ నటించిన RRR కి ఆస్కార్ రావడం అలాగే మరో దర్శకుడు శంకర్ తో చేస్తున్న భారీ సినిమా నుంచి కూడా అప్డేట్ రానుండడం పైగా తన కెరీర్ లో డిజాస్టర్ కం కల్ట్ క్లాసిక్ హిట్ అయినటువంటి “ఆరెంజ్” రీ రిలీజ్ అయ్యింది.

మరి ఈ సినిమాకి అయితే చాలా టైట్ షెడ్యూల్, పైగా పలు చిత్రాలు ఉన్నప్పటికీ ఆరెంజ్ రీ రిలీజ్ కాగా మాసివ్ రెస్పాన్స్ ఈ సినిమాకి నమోదు అయ్యింది. ఇక మెయిన్ గా అయితే నైజాం రీజన్ లో క్రాస్ రోడ్స్ లో ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ లలో అయితే ఆల్ టైం రికార్డు కొట్టడం ఇప్పుడు విశేషం. క్రాస్ రోడ్స్ లో మొత్తం 12 షో లు ప్లాన్ చేయగా 12 కి కూడా హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం విశేషం.

పైగా ఇది చరణ్ కెరీర్ లో అప్పట్లో ఎలాంటి పరాజయం పాలయిందో కూడా తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా పవర్ ఏంటో ఇప్పుడు కనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా జెనీలియా హీరోయిన్ గా నటించింది. అలాగే హరీష్ జై రాజ్ సెన్సేషనల్ మ్యూజిక్ ఆల్బమ్ ని అందించాడు.

సంబంధిత సమాచారం :