వేరే లెవెల్ హైప్ లో చరణ్ నెక్స్ట్..మరిన్ని సాలిడ్ అప్డేట్స్ ఇవే.!

Published on Sep 7, 2021 4:00 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు అనంతరం మరో పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా రేపు అధికారికంగా పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోనుంది అని తెలిసిందే.. అయితే అసలు ఈ అప్డేట్ పై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోయినా ప్రెజెంట్ బజ్ తో ఇంకొక్క రోజు మాత్రమే బ్యాలన్స్ ఉండడంతో హైప్ మళ్ళీ సినిమా అనౌన్సమెంట్ చేసిన నాటి టైం లో ఉన్నట్టు వచ్చేసింది.

ప్రస్తుతం సినీ వర్గాల్లో ట్రెండ్ అవుతున్న ఈ సెన్సేషనల్ కాంబోపై మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమా ఓపెనింగ్ కి గాను బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హాజరు కానున్న సంగతి తెలిసిందే.. మరి తనతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారట.

అంతే కాకుండా రేపు ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ముహూర్తం కుదిరినట్టుగా తెలుస్తుంది. మరి ఈ మెగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ నుంచి 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :