మళ్ళీ షూటింగ్ ప్లాన్ చేస్తున్న శంకర్ !

Published on Jan 24, 2022 11:00 pm IST

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ – విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయింది. అయితే, చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ను పోస్ట్ ఫోన్ చేశారు. అయితే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది కాబట్టి.. ఇప్పుడు శంకర్ తన సినిమా షూటింగ్ ను మళ్ళీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది. నిజానికి సహజంగానే తన సినిమాల్లో హీరోల్ని డిఫరెంట్ గెటప్స్ అండ్ మేకప్స్ తో చూపించే ఆనవాయితీ ఉన్న శంకర్, ఈ సినిమాలో కూడా చరణ్ ను అలాగే వినూత్నంగా చూపించబోతున్నాడట. అలాగే బాలీవుడ్ నటి ఇషా గుప్తా కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనుంది.

సంబంధిత సమాచారం :