చిరుకి చరణ్ ప్రత్యేక విషెస్ !

Published on Aug 22, 2021 11:10 am IST


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలో అభిమానులు ఫుల్ బిజీ అయిపోయారు. ఇక తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన తండ్రికి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు.

వీడియోలో చరణ్ -చిరు ఆచార్య సెట్స్ కి వెళ్తూ కనిపించారు. మెగాస్టార్ తో కలిసి నటించే ప్రతి షాట్ ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అంటూ చరణ్ పోస్ట్ చేశాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా చివరి దశలో ఉంది.

ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :