వర్మ కామెంట్స్ తో అయోమయంలో పడిన చరణ్, తారక్ ఫ్యాన్స్ !
Published on Nov 19, 2017 3:17 pm IST

నిన్న సాయంత్రం దర్శక ధీరుడు రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్ది నిముషాల్లోనే అది వైరల్ గా మారిపోయి రాజమౌళి చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ చేయనున్నారనే బలమైన వార్త బయటికొచ్చింది. దీంతో చరణ్, తారక్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా హర్షం వ్యక్తం చేయగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఊహించని రీతిలో స్పందించారు.

‘ఆడవారిని ఎంతగానో పూజించే తాను ఇలా గే కల్చర్ ను కఠోరంగా ప్రచారం చేయడాన్ని నిరసిస్తున్నాను’ అంటూ ‘పైగా ముగ్గురు పెళ్ళైన వాళ్ళే. అందరూ ఆ టైపేనా. ఏం జరుగుతోంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ను చూసిన చరణ్, తారక్ అభిమానులు ఇంతకీ వర్మ ఈ కామెంట్స్ ను సరదాగా చేశారా లేకపోతే విమర్శించడానికే చేశారో తెలీక ఎలా స్పందించాలో అర్థం కాక అయోమయంలో పడ్డారు.

 
Like us on Facebook