చిరు 151వ సినిమాలో రానా !

9th, May 2017 - 11:57:41 AM


మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాని నిర్మాత రామ్ చరణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని భావిస్తున్నారు. అందుకే సినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించడమే కాకుండా నటీనటుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్.

అందులో భాగంగానే ‘బాహుబలి’ సిరీస్ తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న నటుడు, చిన్ననాటి స్నేహితుడు అయిన రానా దగ్గుబాటిని ఈ ప్రాజెక్టులో నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కానీ రానా బాహుబలి-2 ప్రమోషన్లలో బిజీగా ఉండటం వలన ఈ ప్రపోజల్ ఇంకా అయన వరకు వెళ్లలేదని కూడా అంటున్నారు. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారాంగా తెరకెక్కనుంది.