ఇకపై ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కి చరణ్ అప్డేట్స్.

Ram Charan1

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా లో అంతగా యాక్టీవ్ గా ఉండరనే చెప్పాలి. దీనితో చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా వేదికలైన ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ లలో ఆమె అప్ డేట్స్ తో పాటు, చరణ్ మూవీ అలాగే పర్సనల్ అప్ డేట్స్ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఐతే రామచరణ్ నేడు అధికారికంగా ఇంస్టాగ్రామ్ ఖాతాని తెరిచారు. ఐతే గతంలో చరణ్ కి ట్విట్టర్ ఖాతా ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో దానిని డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు చరణ్ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అందుబాటులోకి రావడంతో తన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట.

ప్రస్తుతము ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ విరామంలో ఉన్న చరణ్ త్వరలో పూణే,అహ్మదాబాద్ ప్రదేశాలలో జరగనున్న షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఈ షెడ్యూల్ లో చరణ్,అలియా పై కొన్ని ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.

Exit mobile version