‘రంగస్థలం’ లో చరణ్ ఎనర్జీ పీక్స్ అంటున్న సహా నటుడు !

రామ్ చరణ్, సుకుమార్ ల కలయికలో రూపొందుతున్న ‘రంగస్థలం 1985’ ప్రస్తుతం ఆఖరి దశ షూటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లోనే వైవిధ్యమైనదిగా చెప్పబడుతున్న ఈ చిత్రం 1985 కాలంలో గ్రామీణ నైపథ్యంలో నడిచే రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. అనేట్టుగాక ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే సినిమాలో మాస్ కంటెంట్ భీభత్సంగా ఉంటుందని కూడా అర్థమవుతోంది.

ఇదే విషయాన్ని గురించి చిత్ర నటీనటుల్లో ఒకరైన కమెడియన్ మహేష్ మాట్లాడుతూ ‘చరణ్ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ఈ రంగస్థలం ఒక ఎత్తు. ఇందులో మాస్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. చరణ్ ఊర మాస్ లుక్ లో కనిపిస్తారు. అయన ఎనర్జీ, నటన పీక్స్ లో ఉంటాయి’ అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 30 న రిలీజ్ చేయనున్నారు.