సుకుమార్ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఇలానే ఉంటుంది !

23rd, April 2017 - 06:47:51 PM


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా సుకుమార్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రంలో ఆయన లుక్ చూస్తుంటే పూర్తిగా స్టార్ హీరో అనే ఇమేజ్ ను పక్కనబెట్టి కథకు, పాత్రకు ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లు కమర్షియల్ మాస్ హీరోగానే కనబడ్డ చరణ్ గతేడాది ‘ధృవ’ తో కాస్త భిన్నత్వం చూపించి ఇప్పుడు సుకుమార్ సినిమాతో పూర్తి స్థాయి వైవిధ్యం ప్రదర్శించనున్నాడు. ఇన్నాళ్లు ఈ చిత్రంలో చరణ్ ఒక పక్కా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడని అనుకున్నారు.

అంతేగాని ఆ పాత్ర స్వభావం, వృత్తి ఏమిటో బయటకు తెలీలేదు. తాజాగా ఈ చిత్రం యొక్క సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో చరణ్ జాలరి వృత్తి చేసే యువకుడిగా కనిపిస్తాడని, అతని పేరు చిట్టి బాబని తెలుస్తోంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రధాన ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోని కొల్లేరులో షూటింగ్ జరుపుకుంటున్న జరువుకుంటున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.