‘శ్యామ్ సింగరాయ్’ డైరెక్టర్ తో చరణ్ సినిమా.. నిజమేనా ?

Published on Jan 9, 2022 9:24 pm IST

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో శ్యామ్‌ సింగరాయ్‌ డైరెక్టర్‌ తో రామ్‌ చరణ్‌ సినిమా ఉండబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత చరణ్ ప్రస్తుతం శంకర్‌ సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తో ఓ సినిమా చేస్తాడు. ఆ సినిమా పూర్తి అయ్యాక, సుకుమార్‌ తో కూడా రామ్‌ చరణ్‌ ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

సో.. చరణ్ సినిమాల లైనప్‌ చాలా భారీగానే ఉంది. అయితే, తాజాగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కూడా చరణ్ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇప్పటికే యంగ్ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరితో కూడా ఓ సినిమా ప్లాన్‌ చేశాడు చరణ్‌. మరి చరణ్ – రాహుల్ సాంకృత్యన్ కలయికలో సినిమా వస్తుందో ? రాదో ? చూడాలి. ఇక ఇటీవల శ్యామ్‌సింగరాయ్‌ చూసిన చరణ్ చాలా ఇంప్రెస్‌ అయ్యాడు. అందుకే రాహుల్ సాంకృత్యన్ కి ఛాన్స్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది.

సంబంధిత సమాచారం :