‘రంగస్థలం 1985’ షూటింగ్ అప్డేట్ !


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చేస్తున్న ‘రంగస్థలం1985’ సినిమా యొక్క 3వ షెడ్యూల్ ఈరోజే పూర్తయింది. పూర్తిగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షెడ్యూల్ బాగా వచ్చిందని, సభ్యులంతా చాలా సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో దాదాపు 40 శాతం టాకీ పార్ట్ తో పాటు ఒక పూర్తి పాట, మరొక పాట సగం వరకు పూర్తయ్యాయట.

కొత్త షెడ్యూల్ ను టీమ్ ఈ నెలాఖరు నుండి హైదరాబాద్లో రూపొందిస్తున్న ప్రత్యేక సెట్లో మొదలుపెట్టనున్నారు. ‘ధృవ’ తర్వాత చరణ్ చేస్తున్న భిన్నమైన సినిమా కావడం, దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ చేస్తుండటంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో భారీ స్థాయి అంచనాలున్నాయి. ఈ క్రేజ్ వల్లనే సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ పెద్ద మొత్తానికి అమ్ముడయ్యాయి.