“లైగర్” నుండి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ పై క్లారిటీ!

Published on Dec 15, 2021 5:00 pm IST


విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఈ చిత్రం ఉప శీర్షిక. ఛార్మి కౌర్ మరియు పూరి జగన్నాథ్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రం లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి ఒక కీలక అప్డేట్ పై ఛార్మి కౌర్ సోషల్ మీడియా వేదిక గా ప్రకటించడం జరిగింది.

ఈ చిత్రం కి సంబంధించిన మోస్ట్ అవైటెడ్ అనౌన్స్ మెంట్ ను రేపు ఉదయం 10:03 గంటలకు రివీల్ చేయనున్నారు. ఈ ప్రకటన తో కాస్త సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :