“బోయపాటి రాపో ఫస్ట్ థండర్” మైండ్ బ్లోయింగ్ – ఛార్మీ కౌర్

“బోయపాటి రాపో ఫస్ట్ థండర్” మైండ్ బ్లోయింగ్ – ఛార్మీ కౌర్

Published on May 15, 2023 3:00 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మొదటిసారిగా ఒక యాక్షన్ డ్రామా కోసం చేతులు కలిపారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా బోయపాటి రాపో అని టైటిల్ పెట్టారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ థండర్ పేరిట వీడియో ను విడుదల చేశారు. రామ్ పోతినేని చెప్పిన మాస్ డైలాగ్‌తో ఫస్ట్ థండర్ పవర్ ఫుల్ గా ఉంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ యొక్క పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలవడం మాత్రమే కాకుండా, టీజర్ ను వేరే లెవెల్ కి తీసుకు వెళ్ళింది.

రామ్ రగ్డ్ లుక్ చాలా బాగుంది. ఈ ఫస్ట్ వీడియో కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సినీ ప్రముఖులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నటి, ప్రొడ్యూసర్ ఛార్మీ ఈ వీడియో పై రెస్పాండ్ అయ్యారు. మైండ్ బ్లోయింగ్ అంటూ చెప్పుకొచ్చారు. ఛార్మి కౌర్ మరియు పూరీ జగన్నాథ్ ల తో రామ్ మరొక చిత్రం డబుల్ ఇస్మార్ట్ ను చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. శ్రీలీల, సాయి మంజ్రేకర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ బోయపాటి రాపొ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20, 2023న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కి సిద్ధం అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు