పూరీ జగన్నాథ్ ప్రమోద్ వీడియో ను పోస్ట్ చేసిన ఛార్మి..!

Published on Oct 25, 2021 11:21 am IST

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ముంబై లో లైగర్ చిత్రం పనుల్లో బిజిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అనుకోకుండా ముంబై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పూరి జగన్నాథ్ వాహనం ఆగగా, ఒక అభిమాని పూరి వద్దకు వచ్చి షాక్ కి గురయ్యాడు. తను తెలుగు వాడినని, టీఎస్ వాహనం చూసి, మన తెలుగు వాళ్ళు అని అనుకున్నా అని, కాకపోతే పూరి జగన్నాథ్ ను చూడటం తో సంతోషం వ్యక్తం చేశారు.

పూరి జగన్నాథ్ కి తను పెద్ద అభిమాని ను అంటూ చెప్పుకొచ్చారు. అతను పేరు ఎంటి అని పూరి అడగగా, ప్రమోద్ అంటూ చెప్పుకొచ్చారు. తన దగ్గర ఫోన్ లేకపోవడం తో సెల్ఫీ తీసుకోవడం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈ సంభాషణ ను నటి ఛార్మి కౌర్ రికార్డ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఈ వీడియో తన కోసమే అంటూ చెప్పుకొచ్చారు. లైగర్ సినిమా సమ్మర్ లో వస్తుంది తప్పకుండా చూడు అంటూ పూరి జగన్నాథ్ అడగగా, ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా ఈ చిత్రం లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More