‘జ్యోతిలక్ష్మీ’ కోసం ఛార్మీ స్పెషల్ కేర్

charmi

స్టార్ హీరోల సరసన హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొని తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న భామ చార్మింగ్ గర్ల్ చార్మీ. ఛార్మీ మరోసారి దాశించ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి చేసిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘జ్యోతిలక్ష్మీ’. మార్చిలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ని కేవలం 37 రోజుల్లో పూర్తి చేసారు. ఒక వేశ్య అయిన జ్యోతిలక్ష్మీ జీవితంలో చోటు చేసుకునే మార్పుల చుట్టూ ఈ సినిమా కథ జరుగుతుంది. షూటింగ్ మొత్తం ఫినిష్ అయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

గత కొద్ది రోజులుగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయా స్టూడియోస్ లో జరుగుతున్నాయి. ఈ జ్యోతిలక్ష్మీ సినిమా ఛార్మీ కెరీర్ కి చాలా కీలకం కావడంతో చాలా స్పెషల్ కేర్ తీసుకుంటోంది. డబ్బింగ్ విషయంలో ఎక్కడా మిస్టేక్స్ ఉండకూడదని ఎక్కువ టైం తీసుకొని డబ్బింగ్ చెబుతోంది. చెప్పాలి అంటే ఎక్కువ టైం డబ్బింగ్ థియేటర్ లో గడుపుతోంది. త్వరలోనే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి జూన్ లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ జ్యోతిలక్ష్మీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని గోవాలో షూట్ చేసారు. చార్మీతో పాటు సత్య, వంశీ ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ సినిమాకి పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తే, సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. సికె ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుభ శ్వేతా ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ఛార్మీ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.

Exit mobile version