ఇక్కడ “కస్టడీ” కి డోస్ పెంచాల్సిందేనా.?

Published on May 2, 2023 8:07 pm IST


అక్కినేని వారు యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో నాగ చైతన్య హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన బై లాంగువల్ చిత్రం “కస్టడీ” కోసం తెలిసిందే. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి కూడా మంచి అంచనాలు నెలకొల్పుకోగా మేకర్స్ అయితే ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసేసారు.

అయితే వీటిలో ఎక్కువ తెలుగు కంటే తమిళ్ లోనే ప్రమోషన్స్ ఎక్కువ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎలాగో చైతుకి తెలుగులో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి తమిళ్ లో మొదట టార్గెట్ చేయొచ్చు కానీ తెలుగులో రీసెంట్ టైమ్స్ లో వచ్చిన పలు చిత్రాల కంటే తక్కువ ప్రమోషన్స్ అది కూడా ఆఫ్ లైన్ మరియు ఆఫ్ లైన్ లో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి మేకర్స్ ఈ విషయంలో ఏమన్నా ప్రత్యేక దృష్టి సారిస్తారో లేదో చూడాలి. సినిమా రిలీజ్ కి ఇంకా కొన్ని రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది.

సంబంధిత సమాచారం :