నాగ చైతన్య నెక్స్ట్ సినిమా నిన్నే పెళ్ళాడతా టైప్ లో ఉంటుందట

naga-chaitanya1
అక్కినేని యువ హీరో నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన చేసిన ‘ప్రేమమ్, సాహసం స్వాసగా సాగిపో’ చిత్రాలు రిలీజుకు రెడీగా ఉండగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇకపోతే ఈ చిత్రం కూడా కంప్లీట్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుందని, ఒకరకంగా చెప్పాలంటే ఈ కథ ‘నిన్నే పెళ్ళాడతా’ టైప్ లో ఉంటుందని తెలుస్తోంది.

కృష్ణ వంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 1996లో విడుదలైన ఈ ‘నిన్నే పెళ్లాడతా’ నాగార్జునకు లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టడమేగాక లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లకు ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. కనుక చైతు సినిమా కూడా నిన్నేపెళ్లాడతా తరహాలోనే ఉంటే ఖచ్చితంగా హిట్ గా నిలిచి అతనికి స్టార్ డమ్ ను మరింత పెంచడం ఖయాం.