చైతు టీజర్ తో వస్తున్నాడు !


నాగ చైతన్య తదుపరిచిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర టీజర్ ని రేపు సాయంత్రం 4: 30 కి విడుదల చేయనున్నారు.

ఈ చిత్రం లోని మొదటి సాంగ్ ని మాత్రం ఈ రోజే విడుదల చేస్తారు.ఈ చిత్రాన్ని మే 19 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహకాలు చేస్తోంది.ఈ చిత్రంలో నాగచైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.