రామ్‌ గోపాల్‌ వర్మపై చీటింగ్ కేసు.. ఎందుకంటే?

Published on May 24, 2022 3:01 am IST


వివాదస్పద సినిమాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురుంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేసినా, ఏం మాట్లాడినా అది సంచలనమే అవుతుంది. ఏదో ఒక విషయంలో నిత్యం వర్మ వార్తల్లో నిలుస్తుంటాడు. అయితే తాజాగా ఆయనపై ఒక చీటింగ్ కేసు నమోదైంది. గతంలో శేఖర్ రాజు అనే వ్యక్తి దగ్గర వర్మ 56 లక్షల రూపాయలు తీసుకున్నాడని, ఈ విషయంలో డబ్బులు తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారని శేఖర్ రాజు కోర్టును ఆశ్రయించాడు.

ఇదే విషయంపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. దిశ సినిమా నిర్మించేదుకు గాను 56 లక్షలు తీసుకున్న వర్మ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడడంతో ఫిర్యాదు చేశానని శేఖర్ రాజు పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 406, 417, 420, 506 సెక్షన్ల కింద వర్మపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత సమాచారం :